WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

Home » » Annamayya District Anganwadi Workers Recruitment 2024 Notification

Annamayya District Anganwadi Workers Recruitment 2024 Notification

Annamayya District Anganwadi Workers Recruitment 2024 Notification, Vacancies, Schedule, Application Form NOTIFICATION FOR FILL UP THE VACANCIES OF ANGANWADI WORKERS/ MINI ANGANWADI WORKERS/ ANGANWADI HELPERS OF ANNAMAYYA DISTRICT.

Memo.No.51/A2/DW&CDA/ANMYA, తేది: 23.12.2024.

అన్నమయ్య జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యెస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

వ. సంఖ్య పోస్టు పేరు ఖాళీల సంఖ్య
1 అంగన్వాడి కార్యకర్త (AWW) 11
2 అంగన్వాడి సహాయాకురాలు (AWH) 93
3 మినీ అంగన్వాడి కార్యకర్త (AWW) (Mini AWW) 12

 ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 21, తేది: 24.08.2007 మరియు 38, తేది: 03.11.2008, మరియు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య  15, WDCW&DW(ICDS).Dated:4.4.2012 ప్రకారము పై తెలుపబడిన పోస్టులకు  అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి:

a) 01.07.2024వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయును.

b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

c) అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.

d) యస్.సి./ఎస్.టి. హబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడి కేంద్రముల (మెయిన్ /మినీ) యందు కేవలం యస్.సి. / యస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.

e) నోటిఫై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రములకు యయెస్.సి. / యస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి. / యస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)

ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 18, తేది: 15.05.2015 ప్రకారం దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రాతిపదికన అంగన్వాడి కార్యకర్త, సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును.

S.
No.

Parameters

Marks

1

If 10th class passed

50

2

Pre-School teacher training or creche and pre-school management training conducted by the board of intermediate or recognized university/working as ECE workers

5

3(a)       

Widow

 5

3(b)       

Widow with minor children (additional)

 5

4

Candidate who is a orphan and who has been an inmate of Bala Sadan/ Govt. institutions/ Govt. recognized institutions

10

5

Differently abled candidates

5

6

Oral interview

20

 

Total

100

 కావున అభ్యర్థులు పై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గెజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

Anganwadi Jobs: అన్నమయ్య జిల్లాలో 116 అంగన్వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

అన్నమయ్య జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 116 అంగన్వాడీ పోస్టుల భర్తీకి జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. మొత్తం 11 ప్రాజెక్టుల పరిధిలో కార్యకర్తల పోస్టులు 11, మినీ కార్యకర్త 12, సహాయకుల పోస్టులు 93 ప్రకారం ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ 24 నుంచి ఎక్కడికక్కడ సీడీపీఓలు అర్హుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. జనవరి 2వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు. రిజర్వేషన్ రోస్టర్, ఇతరాత్ర సమగ్ర వివరాల కోసం ఆన్లైన్ లేదా సంబంధిత ప్రాజెక్టు కార్యాలయం నోటీసు బోర్డులో చూసుకోవచ్చు. బి.కొత్తకోట, చిట్వేల్, ఎల్ఆర్ పల్లి, మదనపల్లి, పీలేర్, రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, టి.సండుపల్లి, తంబలపల్లి, వాల్మీకిపురం ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నాయి.

ఖాళీల వివరాలు:

అంగన్వాడీ వర్కర్/ మినీ అంగన్వాడీ వర్కర్/ అంగన్వాడీ హెల్పర్: 116 పోస్టులు

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మహిళలు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.

వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: నెలకు అంగన్వాడీ వర్కర్ పోస్టులకు రూ.11500, మినీ అంగన్వాడీ వర్కర్కు రూ.7000, అంగన్వాడీ హెల్పర్కు రూ.7000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో అందజేయాలి. బయోడేటాతో పాటు విద్యార్హతలు, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అప్లికేషన్ అందజేయాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 24-12-2024

దరఖాస్తుకు చివరి తేది: 02-01-2025.

ముఖ్యాంశాలు:

  • అన్నమయ్య జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
  • అర్హులైన అభ్యర్థులు జనవరి 2వ వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

 ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 39, తేది: 06.09.2011 ప్రకారం పై తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది. జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్ధులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (../../../EWS/Minor Locomotor Disability/ Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే), అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూ దరఖాస్తు చేసుకొనవచ్చును).

కమిషనర్ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ వారి Memo No. 4918/K3/2015, Dt. 30.10.2015 ప్రకారం అభ్యర్థుల ఎంపికలో అంగన్వాడి కేంద్రము ఉన్న గ్రామమును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును. అదేవిధముగా మునిసిపాలిటీ పరిదిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా తీసుకొనుట జరుగును.

కావున అభ్యర్థులు వారి స్థానికతకు సంబందించి పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు నిర్దేశిత కాలంన్ లో పొందుపరిచి వాటి దృవీకరణ పత్రములు అనగా ఆధార్ కార్డు/రేషన్ కార్డ్ / వోటర్ కార్డ్ / మీ సేవ ద్వారా జారీ చేయబడిన దృవీకరణ పత్రములను విధిగా దరఖాస్తునకు జతపరుచవలయును. అట్లు జతపరచని ఎడల వారి దరఖాస్తు పరిగణలోనికి తీసుకొనబడదు.

  ప్రభుత్వం వారి మెమో సంఖ్య WDCO2/16030/67/2021/ICPS-WD&CW 22: 22-09- 2021 ప్రకారం మినీ అంగన్ వాడీ వర్కర్ల ఎంపికలో వికలాంగులకు రిజర్వేషన్ నియమం పిల్లల భద్రత దృష్ట్యా పూర్తిగా మినహాయించబడుటయినది. అంగన్వాడీ కార్యకర్తలు మరియు సహాయకురాలులకు సంబంధించి, 6 (అంధత్వం మరియు తక్కువ దృష్టి), 31 (చెవిటివారు మరియు వినికిడి లోపం) మరియు 86 (ఆటిజం, మేధోపరమైన వైకల్యం, నిర్దిష్ట అభ్యాస వైకల్యం, మానసిక వైకల్యం, బహుళ వైకల్యాలు) వ రోస్టర్ పాయింట్ రిజర్వేషన్కు మినహాయింపు ఉంది. పిల్లల భద్రత మరియు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని, మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న వ్యక్తులు మాత్రమే పిల్లల సంరక్షణ మరియు గృహ సందర్శనల సామర్థ్యానికి ఆటంకం కలిగించని 4 వైకల్యం రోస్టర్ పాయింట్లకు వ్యతిరేకంగా పరిగణించబడతారు. మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అటువంటి అర్హత గల వ్యక్తి లేకుంటే, 6, 31 మరియు 86 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్లను వైకల్యం ఉన్న వ్యక్తులతో కాకుండా ఇతరులతో నింపబడుదురు. 56 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్ మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు ఫార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిఫికేషన్ కూడా మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న 

వ్యతిరేకంగా పరిగణించబడతారు. మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అటువంటి అర్హత గల వ్యక్తి లేకుంటే, 6, 31 మరియు 86 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్లను వైకల్యం ఉన్న వ్యక్తులతో కాకుండా ఇతరులతో నింపబడుదురు. 56 వద్ద ఉన్న రోస్టర్ పాయింట్ మాత్రమే తదుపరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు ఫార్వార్డ్ చేయబడవచ్చు మరియు రెండవ నోటిఫికేషన్లో కూడా మైనర్ లోకోమోటర్ వైకల్యం ఉన్న అర్హత గల అభ్యర్థి లేకుంటే, రోస్టర్ పాయింట్ 56 కూడా వికలాంగులు కాకుండా ఇతరులతో నింపవచ్చు. కావున తదనుగుణంగా ఈ ప్రకటన యందు రోస్టర్ పాయింట్లు కేటాయించడం జరిగినది.

 ప్రకటింపబడిన పోస్టులలో గౌరవ న్యాయస్థానముల యందు కేసులు పెండింగులో ఉన్న వాటి భర్తీనకు సంబందించి, ఆయా కేసులకు సంబందించి వెలువడు తదుపరి ఉత్తర్వులు మేరకు వారి నియామకము రద్దు పరచుట కాని, కొనసాగింపు కాని జరుగును.

అంగన్వాడీ కార్యకర్త (Main & Mini), అంగన్వాడీ హెల్పర్లు గౌరవ కార్యకర్తలు, కావున ఈ నియామకము పూర్తిగా తాత్కాలికము మరియు పోస్టులకు నియామకమగు అభ్యర్ధులకు ప్రభుత్వ నిబందనల ప్రకారము గౌరవ వేతనము మాత్రమే చెల్లించబడును.

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబందించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

దరఖాస్తు చేసుకొనుటకు ప్రారంబ తేది: 24/12/2024

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 02/01/2025

ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాదికారితా అధికారి వారి కార్యాలయము, అన్నమయ్య వారికి సర్వ హక్కులు కలవు.

ఈ నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారం ను https://annamayya.ap.gov.in/ వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకొనగలరు.

Annamayya District Anganwadi Workers Recruitment 2024 Important Links:

Join Our Telegram for more Job Updates:  https://t.me/jobnews_govt

Download Detailed Notification