KVS Recruitment Admit Cards 2023 released for the post of PRT, TGT, PGT and Other jobs CBT Exam February-March 2023 How to download KVS principal, PGT TGT PRT Non Teaching Hall tickets 2023 kvsangathan.nic.in
KVS admit card for the post of Asstt. Commissioner, Principal, Vice-Principal and PRT (Music) - Direct Rectt 2022
దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) భారీగా టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్వహించే పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 13,404 పోస్టులకు భర్తీకి దశల వారీగా మార్చి 6వరకు పరీక్షలు జరగనుండగా.. ఈ నెల 7న అసిస్టెంట్ కమిషనర్, 8న ప్రిన్సిపల్, 9న వైస్ ప్రిన్సిపల్ & పీఆర్‌టీ (మ్యూజిక్) పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకొనేందుకు kvsangathan.nic.in సైట్‌లోకి వెళ్లి.. మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌లను ఎంటర్ చేయడం ద్వారా పొందొచ్చు.
అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల(52)కు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 7న జరగనుండగా.. ప్రిన్సిపల్ (239) పోస్టులకు ఫిబ్రవరి 8; వైస్ ప్రిన్సిపల్(203) & పీఆర్‌టీ (మ్యూజిక్-233) ఫిబ్రవరి 9, టీజీటీ (3,176) పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు; పీజీటీ (1,409) పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు; ఫైనాన్స్ ఆఫీసర్(6), ఏఈ(సివిల్-2), హిందీ ట్రాన్స్‌లేటర్(11) ఉద్యోగాలకు ఫిబ్రవరి 20న; పీఆర్‌టీ ఉద్యోగాలకు(6,414) ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు; జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల(702)కు మార్చి 1 నుంచి 5 వరకు; స్టెనోగ్రాఫర్ గ్రేడ్- 2 (54) ఉద్యోగాలకు మార్చి 5; లైబ్రేరియన్ (355), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్(156), సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(322) ఉద్యోగాలకు మార్చి 6న పరీక్ష నిర్వహించనున్నట్టు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ను వీక్షించాలని సూచించింది.
Date of Examination |
Post |
07.02.2023 |
Assistant Commissioner |
08.02.2023 |
Principal |
09.02.2023 |
Vice-Principal & PRT(Music) |
12-14 Feb 2023 |
TGT |
16-20 Feb 2023 |
PGT |
20.02.2023 |
Finance Officer, AE(Civil) & Hindi Translator |
21-28 Feb. 2023 |
PRT |
01-05 March 2023 |
Jr Secretariat Assistant |
05.03.2023 |
Stenographer Gr- II |
06.03.2023 |
Librarian, Assistant Section Officer & Senior Secretariat Assistant |