C-DAC Project Staff Recruitment 2023 C-DAC Project Associate, Engineer & Manager Recruitment 2023 Apply Online for 570 Posts
సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు భర్తీకి నోటఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆప్ అద్వాన్సుడ్ కంప్యూటింగ్ (సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
వివరాలు.
* మొత్తం ఖాళీలు: 570
పోస్టుల వారీగా ఖాళీలు:
1. ప్రాజెక్ట్ అసోసియేట్-30
2. ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-300
3. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔటచ్ మేనేజర్ - 40
4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔటచ్ ఆఫీసర్-200
విభాగాలు:
ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్ మైక్రోప్రాసెసర్ అండ్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ అండ్ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ మిషన్, జెన్నెక్స్ట్ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితరాలు.
అర్హత
1. ప్రాజెక్ట్ అసోసియేట్ సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ డీ ఉత్తీర్ణత.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: ఏటా రూ.3.6లక్షలు-రూ.5.04లక్షలు చెల్లిస్తారు.
2. ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ డీ ఉత్తీర్ణత. పని అనుభవం: కనీసం 0-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: ఏటా రూ.4.49లక్షలు-రూ.7.11లక్షలు చెల్లిస్తారు.
3. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔటచ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్సీ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 9-15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9లక్షలు చెల్లిస్తారు.
4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ ! ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔటచ్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ ఉత్తీర్ణత.
పని అనుభవం: కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
జీతభత్యాలు: ఏటా రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.
పని ప్రదేశం: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కాతా, మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్చర్, పుణెలోని కార్పొరేట్ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 20.02.2023
Notification, Online Apply Link, Official Website click here